మెగాస్టారైనా తలవంచాల్సిందే!

Barber Narayana Training in Hairstylist to Unemployed Youth - Sakshi

నిరుద్యోగ యువతకుఅధునాతన శిక్షణ..

ప్రముఖులకు వ్యక్తిగత హెయిర్‌ స్టైలిస్ట్‌

క్షురక వృత్తితోపాటు సేవాగుణం చాటుకుంటున్న నారాయణరావు

సుల్తాన్‌బజార్‌: నిరుద్యోగ యువతకు క్షురక వృత్తిలో మెలకువలు నేర్పుతూ అధునాతన శిక్షణ ఇస్తూ తోడ్పాటునందిస్తున్నారు. చౌటపల్లికి చెందిన ఎస్‌. నారాయణ. యువకుడిగా ఉన్నప్పుడు ఆయన పొట్ట చేతపట్టుకుని తెలిసిన వృత్తి చేస్తూ కడుపునింపుకునే వారు. కాల క్రమేణా హైదరాబాద్‌ నగరంలో పాటు ఇతర రాష్ట్రాల్లో క్షురక వృత్తిలోని మెలకువలను నేర్చుకున్నారు. నారాయణ చిన్నప్పటి నుంచే తనకు వచ్చిన దానిలో ఇతరులకు తనవంతు సాయం చేసేవాడు. అలా ఓ శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి, యువకులకు నేటి ఫ్యాషన్‌కు అనుగుణంగా శిక్షణలు ఇస్తూ ఉపాధి కల్పిస్తుండడం విశేషం..

ప్రముఖుల హెయిర్‌ స్టైలిస్ట్‌గా..
మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పవన్‌కళ్యాణ్, రాజశేఖర్, రాజేంద్రప్రసాద్‌లతో పాటు దాసరినారాయణరావు లాంటి డైరెక్టర్‌లకు నారాయణరావు వ్యక్తిగత బార్బర్‌గా పనిచేశాడు. పవన్‌కళ్యాణ్‌ మొదటి సినిమాకు పవన్‌కళ్యాణ్‌ హెయిర్‌ కటింగ్‌ను తీర్చిదిద్దాడు. అంతేకాకుండా క్రికెటర్‌ అజారుద్దీన్‌ లాంటి క్రీడాకారులకు ఆయన హెయిర్‌స్టైలిస్ట్‌గా పనిచేశారు. దీంతో ఆయనకు ప్రముఖ హెయిర్‌ సెలూన్‌లలో పనిచేసే అవకాశం వచ్చింది. తన కుటుంబానికి అవరమైన డబ్బు సరిపోవడంతో తనకు చిన్ననాటి నుంచి అలవాటు ఉన్న సేవాకార్యక్రమాలపై దృష్టి సారిస్తూ వచ్చాడు. దీంతో షోలోపూర్‌ సేవారత్న బిరుదుతో అక్కడి స్వచ్ఛంద సంస్థలు సత్కరించాయి. దీంతో అనాధాలకు వృద్ధులకు ఉచితంగా క్షవరం చేస్తూ తృప్తి పొందుతూ ఉంటారు.

షోలాపూర్‌లో సేవారత్న పురస్కారం
ఔత్సహికులు శిక్షణ...
నగరంలో నిరుదోగ్య యువత చదుకుని ఖాళీగా ఉంటుడం తన దృష్టికి రావడంతో ఆయన యువతకు తమతమ ఉద్యోగాన్వేషణ కొనసాగిస్తూనే తమ కులవృత్తిలో మెలుకువలు నేర్చుకోవాలని వారికి అవగాహన కల్పిస్తూ సికింద్రాబాద్‌లో ఛార్మ్‌స్‌ పేరిట ఓ శిక్షణాకేంద్రాన్ని ప్రారంభించి నేటి టెక్నాలజీకి అనుగుణంగా నమామాత్రపు రుసుంతో యువతకు శిక్షణలు ఇస్తున్నాడు. ఇక్కడ శిక్షణ పొందిన వారి నగరంలో ఎంతో ఫెమస్‌ సేలూన్‌లు ఏర్పాటు చేసుకుని అతని బాటలో నడుస్తుండడం విశేషం.

సమాజ సేవ ఎంతో సంతృప్తి నిస్తోంది..
నా యవ్వనంలో నా కుటుంబ కడుపునింపేందుకు పనిచేసాను. ప్రస్తుతం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో ఓ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వారికి అదునిక టెక్నాలజీతో బార్బర్‌ వృత్తిలో శిక్షణ ఇస్తున్నాను. శిక్షణ పొందిన పొందిన వారి ఉపాధి పొందితుండడం చూస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుంది.మహిళలు సైతం బ్యూటీ పార్లర్‌ లాంటివి నా శిక్షణ ద్వారా ఏర్పాటు చేసుకోవడంపై ఎంతో సంతోషంగా ఉంటుంది. తన కుమారుడు సంపత్‌ సైతం ఇదే బాటలో నడవడం మనస్సుకు సంతృప్తి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top