కాళేశ్వరం.. అన్ని వర్గాల ఆమోదం

కాళేశ్వరం.. అన్ని వర్గాల ఆమోదం - Sakshi

కామారెడ్డి, చిట్యాల, నారాయణఖేడ్‌లలో ప్రజాభిప్రాయ సేకరణ

అన్నిపార్టీల మద్దతు.. దివంగత సీఎం వైఎస్సార్‌ను గుర్తుచేసిన నేతలు

 

సాక్షి, కామారెడ్డి/చిట్యాల/నారాయణఖేడ్‌: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పర్యావరణ అనుమతుల కోసం నల్లగొండ జిల్లా చిట్యాల, కామారెడ్డి జిల్లాకేంద్రం, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ప్రజాభి ప్రాయ సేకరణ జరిగింది. బుధవారం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రాజె క్టు నిర్మాణానికి మెజారిటీ ప్రజలు, అన్ని పార్టీల నాయకులు ఆమోదం తెలిపారు. చిట్యాలలో మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎన్‌.భాస్కర్‌రావు, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఈఈ పి.జవహర్, నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, ఐబీ డీఈ సురేందర్‌రావు, వివిధ శాఖల అధికారులు, చిట్యాల మండలం సుంకేనేపల్లి, వెలిమినేడు, గుం డ్రాంపల్లి, గ్రామాలతోపాటు నార్కట్‌ పల్లి, రామన్నపేట మండలాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు.



జేసీ నారాయణరెడ్డి మాట్లాడుతూ మెజారిటీ ప్రజల ఆమోదం మేరకు ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపడతామన్నారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ వృథాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను సాగునీరుగా వినియోగించుకు నేందుకు నిర్మించనున్న అద్భుత ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు. నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్మా ణంతో వేలాది ఎకరాలకు సాగునీరు వస్తుం దని, నిర్వాసితులకు న్యాయం చేస్తామన్నారు. 

 

కామారెడ్డిలో: కామారెడ్డిలో ఐదు గంటలపాటు జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ లో కలెక్టర్‌ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎల్లారెడ్డి, జుక్కల్‌ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌సిండే, జెడ్పీ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ముజీబుద్దీన్, జేసీ సత్తయ్య, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ వేణు, ఈఈ శ్రీనివాస్, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.  ప్రాణహిత–చేవెళ్ల పథకంలో భాగంగా 22వ ప్యాకేజీకి దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కామారెడ్డిలోనే శంకుస్థాపన చేశారని డీసీసీబీ మాజీ చైర్మన్‌ ఎడ్ల రాజిరెడ్డి, సీడీసీ చైర్మన్‌ ఇంద్రకరణ్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు జమునా రాథోడ్‌ పేర్కొన్నారు. 75 మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. దాదాపు అందరూ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయా లని, భూనిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రాజెక్టును నిర్మిస్తే మేలు జరుగు తుందని టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం నేతలు అభిప్రాయపడ్డారు.

 

నారాయణఖేడ్‌లో 

నారాయణఖేడ్‌లో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, 400 మంది రైతులు  పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నసాగర్‌ నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీటిని తరలించాలనే ప్రభుత్వ ప్రణాళికను ముక్త కంఠంతో స్వాగతించారు. వలసలకు మారుపేరుగా ఉన్న నారాయణఖేడ్‌ ప్రాం తానికి ఈ ప్రాజెక్టు వరప్రదాయనిగా నిలు స్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. డీపీఆర్‌ లేకుండా ప్రజాభిప్రాయాన్ని సేకరించడంపై కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం తప్పుపట్టాయి. 

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top