పీఆర్‌సీ వర్తింపజేయాలి | Appeal to the Association of Electrical Engineers | Sakshi
Sakshi News home page

పీఆర్‌సీ వర్తింపజేయాలి

Nov 14 2014 1:14 AM | Updated on Sep 5 2018 4:28 PM

విద్యుత్ శాఖ ఉద్యోగులకు 2014 వేతన సవరణ (పీఆర్‌సీ) వర్తింపజేయాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.

  • విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ విజ్ఞప్తి
  • సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ ఉద్యోగులకు 2014 వేతన సవరణ (పీఆర్‌సీ) వర్తింపజేయాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. పది ప్రధాన డిమాండ్లను ప్రస్తావిస్తూ అసోసియేషన్ అధ్యక్షుడు నెహ్రూ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ ఆధ్వర్యంలో టీఎస్‌జెన్‌కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ప్రభాకర్‌రావుకు మెమోరాండం సమర్పించారు.

    కీలకమైన విభాగాలన్నింటా తెలంగాణ ఇంజనీర్లను నియమించాలని.. సీమాంధ్ర ఇంజనీర్లను అప్రాధాన్య విభాగాల్లో సర్దుబాటు చేయాలని అందులో కోరారు. జెన్‌కో విద్యుత్ ప్లాంట్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని.. అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకం చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ ఉద్యోగులకు మెడికల్ పాలసీని వర్తింపజేయాలని, జెన్‌కో ఇంజనీర్లకు కొత్త క్వార్టర్ల నిర్మాణం చేపట్టాలని, పాల్వంచలో జెన్‌కో ఉద్యోగుల కాలనీకి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement