సహకరిస్తే మరో అంకాపూర్‌గా మారుస్తా
‘‘మనం పుట్టిపెరిగిన ఊరు బాగుండాలి.. మనమంతా అభివృద్ధి చెందాలి అనే తపన మనందరిలో ఉన్నప్పుడే గ్రామం అన్ని
కొండారెడ్డిపల్లి గ్రామస్తులతో ప్రకాష్‌రాజ్
దత్తత గ్రామాన్ని సందర్శించిన ‘శ్రీమంతుడు’
కేశంపేట: ‘‘మనం పుట్టిపెరిగిన ఊరు బాగుండాలి.. మనమంతా అభివృద్ధి చెందాలి అనే తపన మనందరిలో ఉన్నప్పుడే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అప్పుడే మనందరి బతుకులు బాగుపడతాయి.’’ అని సినీనటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా మంగళవారం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చేరుకొని తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా.. సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారా.. తరగతి గదులు సక్రమంగా ఉన్నాయా అని ప్రధానోపాధ్యాయుడు పవన్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ.. మీరందరూ పూర్తి సహకారాన్ని అందిస్తే మీ గ్రామాన్ని మరో అంకాపూర్‌గా మారుస్తానని గ్రామస్తులను ఉద్దేశించి అన్నారు. ‘‘నేను మీ ఊరికి సమీపంలోనే వ్యవసాయ పొలాన్ని తీసుకున్నాను. పొలానికి వెళ్లే సమయంలో మీరు పడుతున్న కష్టాలు చూశాను. మీ ఇబ్బందులను గమనించాను.
నాతో పాటు చుట్టుపక్కలవాళ్లు బాగుండాలని అప్పుడు అనిపించింది. అందుకే మీ గ్రామాన్ని దత్తత తీసుకున్నాను.’’ అని ప్రకాష్‌రాజ్ పేర్కొన్నారు. జీవితంలో ఎంతడబ్బు సంపాదించినా కలగని సంతృప్తి పదిమందికి సేవచేయడంలో కలుగుతుందని చెప్పారు. అందుకే తన వంతుగా మీ ఊరిని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చానని తెలిపారు. అన్నదాతలు కృత్రిమ ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులు వినియోగించాలని సూచించారు. హరితహారంలో భాగంగా మా మూలు మొక్కలను కాకుండా పండ్ల మొక్కలను నాటాలని, అవి పెరిగి ఫలాలను ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ టీకే. శ్రీదేవి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జెడ్పీటీసీ సభ్యుడు పల్లెనర్సింగ్‌రావు, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.


