భువన గిరి మండలం వాడపర్తి గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
భువనగిరి మండలం వాడపర్తి గ్రామంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి(45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఊరి శివార్లలో ఉన్న చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.