లక్ష్మిని హత్యచేసిన నిందితులను ఉరితీయాలి

All Party Leaders Complaint To MRO Over Tekula Laxmi Accused Persons - Sakshi

రెబ్బెన(ఆసిఫాబాద్‌): లింగాపూర్‌లో మహిళపై, వరంగల్‌లో యువతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని అఖిల పక్షం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు శుక్రవా రం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్‌ రియాజ్‌ అలీకి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలన్నారు. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి ఒక్కొకరికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి వాటిని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరగని పక్షంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు మల్లయ్య, రాజేష్, దుర్గం రవీందర్, ఉపేందర్, పోశం, సోమయ్య, దేవాజీ, పద్మ, గోపాలక్రిష్ణ, మల్లేష్, శివాజీ, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: వివాహితపై అత్యాచారం.. హత్య

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top