ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాచీన ఆలయాలను దర్శించుకున్నారు.
జడ్చర్ల : ప్రముఖ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణి సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలోని పలు ప్రాచీన ఆలయాలను దర్శించుకున్నారు. తొలుత ఆల్వాన్‌పల్లి సమీపంలోని మీనాంబర దేవాలయంలో శివుడిని దర్శించుకున్న ఆయన, అనంతరం జడ్చర్ల మండలం గంగాపురంలోని లక్ష్మీ చెన్నకేశవస్వామి దర్శనం చేసుకున్నారు.
ఆయన వెంట టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ ఉన్నారు. భరణి ఓ సినిమా తీసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అందులో భాగంగా ప్రాచీన ఆలయాలను సందర్శిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా అడ్డాకుల మండలం కందూరు ఆంజనేయస్వామిని భరణి తరచూ దర్శించుకుంటుంటారు.