9999 @ రూ.8,66,116

9999 Car Number Online Sale Eight Lakhs in Upparpally RTO - Sakshi

రాజేంద్రనగర్‌: ఉప్పర్‌పల్లి ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం 9999 నంబర్‌కు అత్యధిక ధర పలికింది. టీఎస్‌ 07 హెచ్‌ఈ 9999 నంబర్‌కు ఆన్‌లైన్‌లో వేలం వేయగా శేరిలింగంపల్లి కొత్తగూడ అపర్ణ టవర్స్‌కు చెందిన జి.శివరామకృష్ణ రూ. 8,66,116కు కోట్‌ చేసి దక్కించుకున్నారు. ఈ నంబర్‌ కోసం ముగ్గురు పోటీపడగా అత్యధికంగా కోడ్‌ చేసి న శివరామకృష్ణకు కేటాయించారు. ఆయన కొత్తగా కొనుగోలు చేసిన రేంజ్‌రోవర్‌ కారు కోసం డబ్బు వెచ్చించి దక్కించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఆల్‌లైన్‌లో నంబర్‌కు అత్యధిక ధర పలకడం ఇదే మొదటిసారి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top