తాళిబొట్టు తెంపారు.. | 92 thousand rupees fine to uppamma | Sakshi
Sakshi News home page

తాళిబొట్టు తెంపారు..

Dec 26 2014 2:53 AM | Updated on Sep 2 2017 6:44 PM

తాళిబొట్టు తెంపారు..

తాళిబొట్టు తెంపారు..

భార్యాభర్తల గొడవపై కుల పెద్దలు పంచారుుతీ నిర్వహించారు.

రూ.92వేలు జరిమానా వేశారు

చింతకాని: భార్యాభర్తల గొడవపై కుల పెద్దలు పంచాయితీ నిర్వహించారు. శారీరకంగా, మా నసికంగా హింసిస్తున్న భర్తను వారించకపోగా.. బాధితురాలికే ఆ ‘పెద్దలు’ శిక్ష విధించారు. ఆమె తాళిబొట్టును లాక్కున్ని, 92వేల రూపాయలు జరిమానా కట్టాలని ‘తీర్పు’ ప్రకటించారు. దీనిపై ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రచింది. ఆమె తెలిపిన ప్రకారం... వరంగల్ జిల్లా కురవికి చెందిన భద్రమ్మ-బక్కయ్య దంపతుల రెండవ కుమార్తె ఉప్పమ్మకు, చింతకాని మండలం రాఘవాపురం గ్రామస్తుడు నెర్సుల కృష్ణతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరి కాపురం మూడు నెలలపాటు సజావుగా సాగింది.

ఆ తరువాత నుంచి, ఆమె శీలాన్ని అతడు శంకించసాగాడు. ఈ నెపంతో ఆమెను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. కుల పెద్దలు 12సార్లు పంచారుుతీ నిర్వహించారు. వారి సూచనతో, ఆరు నెలల క్రితం రాఘవాపురం నుంచి లచ్చగూడెం గ్రామానికి మకాం మార్చారు. అరుునప్పటికీ భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా, ఆమె కూలీనాలీ చేసిన సంపాదించిన డబ్బుతో భర్త తాగి వచ్చి కొట్టేవాడు. అతడి దాడిలో ఆమె తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమె ఈ నెల 5న తన భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

‘పోలీస్ స్టేషన్‌కు వద్దు. కుల పంచారుుతీలో మాట్లాడుకుందాం’ అని కుల పెద్దలు చెప్పడంతో ఆమె తన ఊరుకుంది. ఆ తరువాత కూడా అతడి వేధింపులు కొనసాగుతుండడంతో కుల పెద్దలు ఇటీవల పంచాయతీ నిర్వహించారు. భర్త వేధింపులను ఇక భరించలేనని కుల పెద్దలతో చెప్పింది. దీనిని వారు జీర్ణించుకోలేకపోయూరు. ఆమెను తప్పుబట్టారు. ఆమె మెడలోని తాళిబొట్టును లాక్కుని, 92వేల రూపాయల జరిమానా విధించారు.

జరిమానా చెల్లించలేనని చెబుతున్నా వినలేదు. ఆమె బాబాయి సంగయ్యపై దాడి చేసి, ఆయనతోప్రాంసరీ నోటుపై సంతకాలు తీసుకున్నారు. ‘‘నా నాలుగేళ్ల కుమారుడు మహేష్‌ను ఎక్కడో దాచిపెట్టారు. నాకు చూపించడం లేదు. నాకు అన్యాయం చేసిన కుల పెద్దలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. నాకు తగిన న్యాయం చేయాలి’’ అని, బాధితురాలు ఉప్పమ్మ పోలీసులను కోరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement