హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 9 కేసులు నమోదయ్యాయి.
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. సోమవారం ఒక్కరోజే 9 కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్, హైదర్‌గూడల్లోని అపోలో, సోమాజిగూడ యశోద, స్టార్, కిమ్స్, హోప్ చిల్డ్రన్స్ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో రెండేళ్ల బాలిక, ఆరు మాసాల శిశువు కూడా ఉన్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలున్న మరో ముగ్గురు ఉస్మానియాలో చేరారు.