యాదాద్రికి 8 రాజగోపురాలు | 8 Rajagopurams to be Built in Yadadri | Sakshi
Sakshi News home page

యాదాద్రికి 8 రాజగోపురాలు

Jul 2 2016 8:25 PM | Updated on Sep 4 2017 3:59 AM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలోని యాదాద్రి ఆలయం 8 రాజగోపురాలతో అందంగా తయారుకానుంది.

యాదాద్రి (నల్లగొండ) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలోని యాదాద్రి ఆలయం 8 రాజగోపురాలతో అందంగా తయారుకానుంది. ఈ ఆలయం సుమారు రెండున్నర ఎకరాల్లో రూపుదిద్దుకోనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే పిల్లర్ల పనులు మొదలయ్యాయి. శివాలయం ఎదుట 150 అడుగుల ఆంజనేయ స్వామి కంచు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ విగ్రహం బెంగళూరులో తయారవుతున్నట్లు సమాచారం.

ఆలయం చుట్టూ రిటైనింగ్ వాల్, తిరుమాడ వీధులు ఉంటాయి. రాజగోపురాలపై ప్రత్యేక శిల్పాలను చెక్కిస్తున్నారు. ఈ శిల్పాలు తయారు చేయడం కోసం ప్రత్యేక కళాకారులను ఆహ్వానించారు. వచ్చే వందేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండాలనే లక్ష్యంతో నిర్మిస్తున్నారు. ఆర్కిటెక్టులు, స్థపతులు, శిల్పకళాకారులు, అనుభవం కలిగిన ఇంజనీర్లు నిర్మాణ రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement