పుస్తకాల పండుగొచ్చే | 39 th National Book Fair inauguratation jan 1 | Sakshi
Sakshi News home page

పుస్తకాల పండుగొచ్చే

Dec 23 2019 4:06 AM | Updated on Dec 23 2019 4:06 AM

39 th National Book Fair inauguratation jan 1 - Sakshi

సాక్షి హైదరాబాద్‌: నగరానికి పుస్తకాల పండగొచ్చింది. ప్రతి ఏటా డిసెంబరులో 9 రోజులపాటు జరిగే పుస్తకాల ప్రదర్శన పుస్తక ప్రియులకు ఓ ప్రత్యేకమైన సంబురం. నేటి నుంచి తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్‌ స్టేడియంలో) 33వ హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ ఫేర్‌ ప్రారంభం కానుంది. పుస్తక ప్రదర్శన ఏర్పాట్లు, దాని ప్రత్యేకతలను బుక్‌ ఫెయిర్‌ ప్రతినిధులు ఆదివారం ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బుక్‌ఫెయిర్‌ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, జాయింట్‌ సెక్రటరీ శోభన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.  

మొత్తం 330 స్టాళ్లు
ఈసారి ప్రదర్శనలో 330 స్టాళ్లు ఏర్పాటు చేశారు, వీటిలో ప్రముఖ ప్రచురణ సంస్థల, పత్రికల స్టాల్స్, తెలుగు, ఇంగ్లిషు సహా అన్ని భాషల పుస్తకాల స్టాళ్లు ఉన్నాయి. ఇక పిల్లలను పుస్తకాలు చదివించేలా బాల మేళాను ప్రముఖంగా నిర్వహిస్తున్నారు. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. గతేడాది 10 లక్షల మంది పాల్గొన్నారని, నగరానికి 50–100 కి.మీ పరిధిలోని పాఠశాలలు తమ విద్యార్థులతో రావాలని గౌరీశంకర్‌ ఆహ్వానించారు. ఇప్పటివరకు 2 లక్షల పాస్‌లను పంపిణీ చేశామన్నారు.  

ఎప్పుడు: పుస్తక ప్రదర్శన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ తమిళిసై ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా గంటా చక్రపాణి, బి.వినోద్‌ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ జనార్ధన్‌ రెడ్డి పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement