కదిలారు.. వదిలారు.. | 270 officers transfered in TSRTC | Sakshi
Sakshi News home page

కదిలారు.. వదిలారు..

Jun 4 2015 2:03 AM | Updated on Sep 3 2017 3:10 AM

ఒకే డిపోలో చిన్న స్థాయి నుంచి వరస పదోన్నతులతో మేనేజర్లుగా ఉన్నత పదవుల్లో పాతుకుపోయిన అధికారులకు ఎట్టకేలకు స్థానచలనం కలిగింది.

టీఎస్ ఆర్టీసీలో 270 మంది అధికారుల బదిలీ
 సాక్షి, హైదరాబాద్: ఒకే డిపోలో చిన్న స్థాయి నుంచి వరస పదోన్నతులతో మేనేజర్లుగా ఉన్నత పదవుల్లో పాతుకుపోయిన అధికారులకు ఎట్టకేలకు స్థానచలనం కలిగింది. దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులందరినీ మారుస్తూ ఆర్టీసీ జేఎండీ రమణరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘కదలరు... వదలరు’ శీర్షికతో ఇటీవల ప్రచురించిన ‘సాక్షి’ కథనానికి స్పందనగా 270 మంది అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని 94 డిపోల్లో 67 డిపో మేనేజర్లను బదిలీ చేశారు.
 
 అదే ర్యాంకులో ఉన్న మరో 50 మందినీ మార్చారు. ఒకే డిపోలో దశాబ్దానికి పైగా పనిచేస్తున్న చాలా మంది అధికారుల్లో చురుకుదనం లేదని ఆర్టీసీ ఉన్నతాధికారులు గుర్తించారు. ఆయా డిపోలు మొక్కుబడిగా ముందుకు సాగుతున్నాయి. వాటి పరిధిలో ఆదాయం పెరగటం లేదు. దీన్ని వివరిస్తూ ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన రమణరావు అలాంటి అధికారుల బదిలీకి కసరత్తు మొదలుపెట్టి వేగంగా పూర్తి చేశారు. వారందరికీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారి బదిలీతో పాటు కొందరు అధికారులకు కూడా పదోన్నతులు కల్పించి పోస్టింగ్స్ ఇచ్చారు. కంట్రోలర్ ఆఫ్ స్టోర్స్‌గా ఉన్న కృష్ణహరికి పదోన్నతి కల్పించి నల్లగొండ ఆర్‌ఎంగా నియమించారు. నల్లగొండ ఆర్‌ఎంగా ఉన్న రవీందర్‌ను మెదక్ ఆర్‌ఎంగా బదిలీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement