జింకను వేటాడిన నిందితుల అరెస్ట్ | 2 arrested in neeladri Forest | Sakshi
Sakshi News home page

జింకను వేటాడిన నిందితుల అరెస్ట్

May 20 2015 10:21 AM | Updated on Sep 3 2017 2:23 AM

ఖమ్మం జిల్లా నీలాద్రీ గుడి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి జింకను చంపిన ఇద్దరు నిందుతులను అటవీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు.

 పెనుబల్లి: ఖమ్మం జిల్లా నీలాద్రీ గుడి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లి జింకను చంపిన ఇద్దరు నిందుతులను అటవీ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం భవనపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఇద్దరు నిందితులు మంగళవారం సాయంత్రం నీలాద్రి అటవీ ప్రాంతంలో వేట కోసం బోలెరో వాహనంలో బయలుదేరారు. ఇది గమనించిన స్థానికులు లంకపల్లి డీఆర్‌వో రేణుకకు సమాచారం అందించారు. దీంతో ఆమె వెంటనే మంగళవారం రాత్రి అడవిలోకి వెళ్లి నిందితుల కోసం గాలించి వారిని పట్టుకున్నారు. కాగా, వీరివద్ద నుంచి ఒక తుపాకిని స్వాధీనం చేసుకొని బోలెరో వాహానాన్ని సీజ్ చేశారు. నిందితులు జింకును చంపి వాహనంలో వేసుకొని వస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఇద్దరిని సత్తుపల్లి పారెస్ట్ డిపోకు తరలించారు. కాగా, నిందితుల పేర్లు అధికారులు ఇంకా బయట పెట్టలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement