సూపర్-స్పీడ్ నెట్:ఇప్పుడు మన హైదరాబాద్ లో.. | Super-speed internet: Now, surf in Hyderabad at a speed of 1 Gbps | Sakshi
Sakshi News home page

సూపర్-స్పీడ్ నెట్:ఇప్పుడు మన హైదరాబాద్ లో..

Mar 30 2017 6:43 PM | Updated on Sep 5 2017 7:30 AM

సూపర్-స్పీడ్ నెట్:ఇప్పుడు మన హైదరాబాద్ లో..

సూపర్-స్పీడ్ నెట్:ఇప్పుడు మన హైదరాబాద్ లో..

సూపర్-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులు ఇప్పుడు మన హైదరాబాద్ లోకి అందుబాటులోకి వచ్చేశాయి.

హైదరాబాద్:
సూపర్-స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులు ఇప్పుడు మన హైదరాబాద్ లో కూడా అందుబాటులోకి వచ్చేశాయి. సెకనుకు 1గిగా బిట్ స్పీడు కలిగిన సూపర్ స్పీడు ఇంటర్నెట్ సేవలను ఏసీటీ ఫైబర్ నెట్  హైదరాబాద్ లో లాంచ్ చేసింది. వీటి ప్రీమియం ధర రూ.5999లేనని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు నివేదించింది. సెకనుకు 1 గిగాబిట్ స్పీడు ఇవ్వడం దేశంలోనే తొలిసారి. ఏసీటీ ఫైబర్ నెట్స్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు త్వరలోనే మరో 11 నగరాలకు అందుబాటులోకి రానున్నాయి. తమ కంపెనీ దేశంలోనే అతిపెద్ద నాన్-టెలికమ్యూనికేషన్ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్(ఐఎస్పీ)గా ఏసీటీ ఫైబర్నెట్ చెబుతోంది.
 
ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీ ద్వారా తాము 1 గిగాబిట్ల బ్రాడ్ బ్యాండ్ స్పీడ్ ను అందిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతమున్న సగటు ఇంటర్నెట్ స్పీడుకి ఇది 400 టైమ్స్ వేగవంతమైనదట. యూఎస్బీ డ్రైవ్ నుంచి చాలా వేగవంతంగా డేటాను ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చట. ఫైల్స్ డౌన్ లోడ్స్ కూడా చాలా ఫాస్ట్ గా చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంటోంది. డిజిటల్ ఇండియా వైపు ప్రభుత్వం, మన నగర వాసులు కదులుతున్న నేపథ్యంలో ఈ సేవలు ఎంతో సహకరించనున్నాయని, డిజిటల్ ఇండియా డ్రీమ్ ను నిజం చేస్తామని కంపెనీ సీఈవో బాలా మల్లాడి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement