జియోని ఏ1 ధర కోత, పలు ఆఫర్లు | Gionee A1 now available at Rs 16,999: Reliance Jio free data, Paytm cashback | Sakshi
Sakshi News home page

జియోని ఏ1 ధర కోత, పలు ఆఫర్లు

Sep 13 2017 7:38 PM | Updated on Sep 19 2017 4:30 PM

జియోని ఏ1 ధర కోత, పలు ఆఫర్లు

జియోని ఏ1 ధర కోత, పలు ఆఫర్లు

జియోని తన స్మార్ట్‌ఫోన్‌ ఏ1 ధరను తగ్గించింది.

జియోని తన స్మార్ట్‌ఫోన్‌ ఏ1 ధరను తగ్గించింది. పండుగ సీజన్‌కు ముందస్తుగా ఏ1 స్మార్ట్‌ఫోన్‌ ధరను 3వేల రూపాయల ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ 16,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. అసలు ఈ ఫోన్‌ ధర 19,999 రూపాయలు. అంతేకాక పలు ఆఫర్లను, డీల్స్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. రిలయన్స్‌ జియో నెట్‌వర్క్‌ను ఏ1 స్మార్ట్‌ఫోన్‌లో యాక్టివేట్‌ చేసుకుంటే, రూ.309 రీఛార్జ్‌ లేదా ఆపై రీఛార్జ్‌లపై అదనంగా 60జీబీ వరకు 4జీ డేటాను ఆఫర్‌ చేయనుంది. పేటీఎంతో జియోని భాగస్వామ్యం ఏర్పరుచుకున్న నేపథ్యంలో కనీసం రూ.350 కొనుగోళ్లపై రూ.250తో రెండు క్యాష్‌బ్యాక్‌ ఓచర్లను పేటీఎం ఈ మొబైల్‌ కొనుగోలుదారులకు అందిస్తోంది. 
 
జియోని ఏ1 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు...
5.5 అంగుళాల హెచ్‌డీ అమోలెడ్‌ డిస్‌ప్లే
మెటల్‌ యునిబాడీ డిజైన్‌
ముందువైపు కర్వ్‌డ్‌ గ్లాస్‌ కోటింగ్‌ 
ఫ్రంట్‌ ఫేసింగ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ 
ఆండ్రాయిడ్‌7.0 నోగట్‌
16ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
13 ఎంపీ రియర్‌ కెమెరా
4జీబీ ర్యామ్‌
64జీబీ స్టోరేజ్‌
256జీబీ వరకు విస్తరణ మెమరీ
4010ఎంఏహెచ్‌ బ్యాటరీ
గ్రే, బ్లాక్‌, గోల్డ్‌ రంగుల్లో అందుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement