breaking news
Gionee A1
-
జియోని ఏ1 ధర కోత, పలు ఆఫర్లు
జియోని తన స్మార్ట్‌ఫోన్ ఏ1 ధరను తగ్గించింది. పండుగ సీజన్‌కు ముందస్తుగా ఏ1 స్మార్ట్‌ఫోన్ ధరను 3వేల రూపాయల ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ 16,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. అసలు ఈ ఫోన్ ధర 19,999 రూపాయలు. అంతేకాక పలు ఆఫర్లను, డీల్స్‌ను కూడా కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను ఏ1 స్మార్ట్‌ఫోన్‌లో యాక్టివేట్ చేసుకుంటే, రూ.309 రీఛార్జ్ లేదా ఆపై రీఛార్జ్‌లపై అదనంగా 60జీబీ వరకు 4జీ డేటాను ఆఫర్ చేయనుంది. పేటీఎంతో జియోని భాగస్వామ్యం ఏర్పరుచుకున్న నేపథ్యంలో కనీసం రూ.350 కొనుగోళ్లపై రూ.250తో రెండు క్యాష్‌బ్యాక్ ఓచర్లను పేటీఎం ఈ మొబైల్ కొనుగోలుదారులకు అందిస్తోంది. జియోని ఏ1 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 5.5 అంగుళాల హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే మెటల్ యునిబాడీ డిజైన్ ముందువైపు కర్వ్డ్ గ్లాస్ కోటింగ్ ఫ్రంట్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆండ్రాయిడ్7.0 నోగట్ 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 13 ఎంపీ రియర్ కెమెరా 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ 256జీబీ వరకు విస్తరణ మెమరీ 4010ఎంఏహెచ్ బ్యాటరీ గ్రే, బ్లాక్, గోల్డ్ రంగుల్లో అందుబాటు -
జియోనీ స్మార్ట్ ఫోన్‌కు భారీ బుకింగ్స్
జియోనీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏ1 బుకింగ్స్ లో అదరగొడుతోంది. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన 10 రోజుల్లోనే 150 కోట్ల విలువైన జియోనీ ఏ1 స్మార్ట్ ఫోన్లు బుకింగ్ అయినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇన్ని బుకింగ్స్ నమోదైన తొలి స్మార్ట్ ఫోన్ తమదేనని, మొత్తం 74,682 యూనిట్ల ప్రీఆర్డర్లను స్వీకరించినట్టు కంపెనీ తెలిపింది. 8 వేల ధర నుంచి 25వేల ధర మధ్యలో ఉన్న ఫోన్లకు ఎక్కువగా బుకింగ్స్ నమోదవుతాయని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అరవింద్ ఆర్ వోహ్రా చెప్పారు. గత నెలలో జరిగిన 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ ఫోన్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. జియోనీ ఏ1 తోపాటు ఏ1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. కాగ జియోనీ ఏ1 ధర రూ.19,999. మార్చి 31 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ను కంపెనీ ప్రారంభించింది. బిగ్ బ్యాటరీ, సెల్ఫీ ఫోకస్డ్ గా ఈ ఫోన్ వినియోగదారులను అలరించడానికి మార్కెట్లోకి వచ్చింది. 4010 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. దీంతో పాటు సెల్ఫీ ఫ్లాష్ ను కూడా 16ఎంపీగా ఉండేటట్టు ఈ ఫోన్ ను కంపెనీ రూపొందించింది. రూ.8 వేల నుంచి రూ.25 వేల లోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు వోహ్రా లాంచింగ్ సందర్భంగానే చెప్పారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కు భారీ బుకింగ్స్ వస్తున్నాయి. ఎక్కువ బుకింగ్స్ ఆఫ్ లైన్ కస్టమర్ల నుంచే వస్తున్నట్టు తెలిసింది. ఆన్ లైన్ నుంచి కొంచెం తక్కువగానే వస్తున్నాయని వోహ్రా చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఈ ఫోన్లను ఎంపికచేసిన ప్రాంతాలోని కస్టమర్లకు ఇవ్వడం ప్రారంభించిందని, అథారైజడ్ స్టోర్లలో ఈ రాత్రి నుంచి ఇతరులకు కూడా అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. 42వేల రిటైల్ అవుట్ లెట్లు, 555 ఎక్స్‌క్లూజివ్ సర్వీసులు సెంటర్లను కంపెనీ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నట్టు వోహ్రా తెలిపారు.