'బాబు పర్యటనంతా సినిమా షూటింగ్లా సాగింది' | ysrcp mla visweswara reddy slams chandrababu over anantapur tour | Sakshi
Sakshi News home page

'బాబు పర్యటనంతా సినిమా షూటింగ్లా సాగింది'

Sep 3 2016 4:16 PM | Updated on Jun 4 2019 5:16 PM

'బాబు పర్యటనంతా సినిమా షూటింగ్లా సాగింది' - Sakshi

'బాబు పర్యటనంతా సినిమా షూటింగ్లా సాగింది'

సీఎం చంద్రబాబు అనంత పర్యటనంతా సినిమా షూటింగ్లా సాగిందని వై.విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు.

అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లా పర్యటనంతా సినిమా షూటింగ్లా సాగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్రెడ్డి ఆరోపించారు. అనంతలో శనివారం పార్టీ సీనియర్ నేతలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
 
చంద్రబాబు పర్యటన భూటకమని ఎమ్మెల్యే విమర్శించారు. రెయిన్ గన్స్ ద్వారా పంటలు రక్షించామని సీఎం చెప్పడం హాస్యాస్పదమన్నారు. జిల్లాలో వేరుశనగ పంట మొత్తం ఎండిపోయిందని...పంటలు ఎండిన తర్వాత రెయిన్ గన్స్ ద్వారా నీరందిస్తామని చెప్పడం సరికాదని విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. రైతులకు ఎకరాకు రూ.10 వేల నష్ట పరిహారం చెల్లించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement