అన్నాడీఎంకే ఎంపీ రాజేంద్రన్‌ మృతి

Villupuram ADMK MP Rajendran died in road accident - Sakshi

సాక్షి, చెన్నై :  ఏఐఏడీఎంకే ఎంపీ రాజేంద్రన్‌ (62) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. శనివారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న వాహనం విల్లుపురం జిల్లా దిండివనమ్‌ సమీపంలో ప్రమాదానికి గురైంది. వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనటంతో ఎంపీ అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా రాజేంద్రన్‌ 2014 లోక్‌సభ ఎన్నికల్లో విల్లుపురం నుంచి ఎన్నికయ్యారు. ఎంపీ మృతి పట్ల ఏఐఏడీఎంకే పార్టీ దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. రాజేంద్రన్‌ కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top