రాత్రిపూట అమ్మాయిల హాస్టల్లో.. | vice chancellor in students toilets at hostels | Sakshi
Sakshi News home page

రాత్రిపూట అమ్మాయిల హాస్టల్లో..

Apr 19 2017 9:01 AM | Updated on Aug 28 2018 5:25 PM

విద్యార్థినులు ఉండే హాస్టల్ గదుల్లో, బాత్‌ రూముల్లో దూరి వైస్‌చాన్స్‌లర్ వింతగా ప్రవర్తిస్తున్నాడు.

మైసూరు: విశ్వవిద్యాలయాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఉప కులపతి అమ్మాయిల హాస్టళ్లలో తిరుగుతూ కలకలం రేకెత్తించారు. వీసీ పీఠాన్నే సందేహాస్పదం చేశారు. విద్యార్థినుల హాస్టళ్లలోని శౌచాలయాలు తదితర ప్రాంతాల్లో తిరుగుతున్న మైసూరు యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ దయానంద మానె ప్రవర్తనపై మంగళవారం హాస్టల్‌ విద్యార్థినిలు వర్సిటీ రిజిస్ట్రార్‌ రాజణ్నకు ఫిర్యాదు చేశారు.

ఫిబ్రవరి 19న మైసూరు యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌గా నియమితులైన దయానంద మానె ఇటీవల యూనివర్శిటీలో విద్యార్థినుల హాస్టల్‌ భవనంలోకి గుట్టుగా వెళ్లి వారి గదులు, టాయ్‌లెట్ల తిరుగుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇది గమనించిన విద్యార్థినులు వీసీ ప్రవర్తన తమకు భయాన్ని కలిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ రాజణ్ణకు ఫిర్యాదు చేశారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన ఘటనపై ప్రభుత్వానికి లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement