కడ్తాల్ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు.
ఆమనగల్లు మండలం కడ్తాల్ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై డీసీఎం, క్రూజర్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన గొల్ల చంద్రయ్య(45), సాలమ్మ(55)లుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆమనగల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.