పెళ్లి చదివింపుల్లో వినూత్న మోసం | Two held for duping people at Marriage in Tamil Nadu | Sakshi
Sakshi News home page

పెళ్లి చదివింపుల్లో వినూత్న మోసం

Sep 6 2017 10:30 AM | Updated on Sep 17 2017 6:29 PM

పెళ్లి చదివింపుల్లో వినూత్న మోసం

పెళ్లి చదివింపుల్లో వినూత్న మోసం

పెళ్లి మండపంలో చదివింపుల సమయంలో వినూత్న మోసానికి పాల్పడిన ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు.

సాక్షి, కేకే నగర్(చెన్నై)‌: కోవిల్‌పట్టి పెళ్లి మండపంలో చదివింపుల సమయంలో వినూత్న మోసానికి పాల్పడిన ఇద్దరిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తూత్తుక్కుడి జిల్లా కోవిల్‌పట్టి  సమీపంలో గల కరుపూర్‌కు చెందిన వీరస్వామి కుమారుడు నిరుబన్‌కు వినితతో కోవిల్‌పట్టిలోగల కల్యాణ మండపంలో సోమవారం పెళ్లి జరిగింది.

పెళ్లికి వచ్చిన వారు చదివింపులు ఇవ్వగా వాటిని కరుపూర్‌కు చెందిన విజయకుమార్‌ (36) వసూలు చేశాడు. అనేక మంది క్యూలో నిలబడి చదివిస్తున్నారు. రద్దీగా ఉన్న ఆ సమయంలో 40 ఏళ్ల  వ్యక్తి తాను రూ. 2 వేలు ఇచ్చానని అందులో రూ.200 తీసుకుని మిగిలిన చిల్లర ఇవ్వాలని అడిగాడు. సరిగ్గా గమనించని విజయకుమార్‌ రూ. 1800 తిరిగి ఇచ్చాడు. కొంత సేపటి తర్వాత 50 ఏళ్ల మహిళ తాను రూ.2 వేలు ఇచ్చానని రూ.200 తీసుకుని మిగతా డబ్బు ఇవ్వాలని అడిగింది. వెంటనే అనుమానంతో మహిళను, ముందు చిల్లర తీసుకున్న వ్యక్తిని కోవిల్‌పట్టి పోలీసులకు అప్పగించారు.

విచారణలో ఆ ఇరువురు మదురై జిల్లా నాగమలై పుదుకోట పావలర్‌ ఎస్టేట్‌ ప్రాంతానికి చెందిన ధనికోటి(40), పిచ్చైయమ్మాల్‌(50) అని తెలిసింది. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి ధనికోటి నుంచి రెండు వేలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఇద్దరు ఇదే విధంగా పలు పెళ్లిళ్లకు హాజరై చేతివాటం చూపే వారని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement