విమానాల్లో సెల్ఫీలకు సెలవ్ ? | Selfies to be banned on planes: DGCA | Sakshi
Sakshi News home page

విమానాల్లో సెల్ఫీలకు సెలవ్ ?

Aug 27 2016 3:44 AM | Updated on Sep 4 2017 11:01 AM

విమానాల్లో సెల్ఫీలకు సెలవ్ ?

విమానాల్లో సెల్ఫీలకు సెలవ్ ?

భద్రతా కారణాల దృష్ట్యా ఇక విమానాల్లో సెల్ఫీలపై త్వరలో డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిషేధం విధించనుంది.

న్యూఢిల్లీ: భద్రతా కారణాల దృష్ట్యా ఇక విమానాల్లో సెల్ఫీలపై త్వరలో డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నిషేధం విధించనుంది. ఇందుకు సంబంధించి డీజీసీఏ నియమ నిబంధనలను రూపొందించే పనిలో ఉంది. విమానాల్లోని కాక్‌పిట్, ఇతర ప్రాంతాలలో సెల్ఫీలు, ఫొటోలు దిగడంపై నిషేధం విధించనున్నట్లు డీజీసీఏ ఉన్నతాధికారి చెప్పారు. ఈ నిబంధనలు పైలట్లు, విమాన సిబ్బందితోపాటు ప్రయాణికులకూ వర్తిస్తాయన్నారు.

కాక్‌పిట్‌లో దిగే సెల్ఫీల వల్ల విమానంతో పాటు ప్రయాణికుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముండటంతో డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం పెరగడంతో విమానాల్లోనే పైలట్లతో సహా, విమాన సిబ్బంది, చాలామంది ప్రయాణికులు విమానాల్లో ఫొటోలు తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement