ఈ– స్కూటర్, విత్తనాల మిషన్‌

Seeds Mission With Scooter In Karnataka - Sakshi

శివాజీనగర: సప్తగిరి ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థులు బ్యాటరీతో నడిచే స్కూటర్, రైతులకు ఉపయోగపడే పంట విత్తనాల మిషన్‌ను మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ప్రదర్శించారు. పాత బజాజ్‌ చేతక్‌ను ఈ–స్కూటర్‌గా మార్చేశారు. ఇందుకు సుమారు రూ.12 వేలు ఖర్చు అయింది. ఎలాంటి కాలుష్యం వెదజల్లదు.

గంటకు 30– 35 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఒకసారి బ్యాటరీని చార్జ్‌ చేయటానికి 4– 5 గంటల సమయం పడుతుంది. కేవలం 3.5 యూనిట్ల విద్యుత్‌ చాలని చెప్పారు. ఇక వ్యవసాయ పరికరంతో బహుళ ప్రయోజనాలున్నాయి. సులువుగా విత్తనాలు వేయవచ్చు. దీని వ్యయం రూ.600–800 మాత్రమేనని విద్యార్థులు తెలిపారు. విద్యార్థులు బీ.భరత్‌కుమార్, బీ.హేమంత్‌కుమార్, వీ.లోకనాథ్, పీ.మంజునాథ్, కాలేజీ అధ్యాపకులు పాల్గొన్నారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top