ఆల్బమ్‌కు సిద్ధం.. | ramya nambeesan Prepare for Songs Album | Sakshi
Sakshi News home page

ఆల్బమ్‌కు సిద్ధం..

Feb 27 2015 12:28 AM | Updated on Sep 2 2017 9:58 PM

ఆల్బమ్‌కు సిద్ధం..

ఆల్బమ్‌కు సిద్ధం..

రెంటికీ చెడ్డ రేవడిలా అయిపోయింది రమ్యానంబీశన్ పరిస్థితి. తొలి రోజుల్లో రామన్ తేడియ సీతై లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న

 రెంటికీ చెడ్డ రేవడిలా అయిపోయింది రమ్యానంబీశన్ పరిస్థితి. తొలి రోజుల్లో రామన్ తేడియ సీతై లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఈ కేరళ కుట్టి ఆ తరువాత మలయాళ చిత్రాలపై ప్రత్యేక దృష్టి సారించి ఇక్కడ అవకాశాలను మిస్ చేసుకుంది. ఆ తరువాత పిజ్జా చిత్రంతో సక్సెస్‌ను అందుకున్న రమ్యానంబీశన్‌కు మళ్లీ అవకాశాలు రావడం మొదలెట్టడంతోపాటు విశాల్ చిత్రం పాండియనాడులో పాడే అవకాశం వచ్చింది. పై పై పై అనే ఆ పాట విశేష ప్రజాదరణ పొందడంతో గాయనిగాను రాణించాలనే కోరికను పెంచుకుంది.
 
 దీంతో హీరోయిన్ అవకాశం తలుపు తట్టినప్పుడు పాడే అవకాశం ఇస్తేనే నటిస్తానంటూ షరతులు విధించడం మొదలెట్టింది. దీంతో నటిగా వచ్చే అవకాశాలు వెనక్కి పోయాయి. చక్కని అందం, అభినయం వున్నా ఆమె కోరికే ఇప్పుడామెకు శత్రువుగా మారింది. ఇలాగుంటే ప్రస్తుతం తమ చిత్రంలో ఒక్క పాట పాడు అనే దర్శక నిర్మాతలేగానీ నటిగా మాత్రం అవకాశాలివ్వడం లేదని వాపోతోంది రమ్యానంబీశన్. ఇక చేసేదేమీ లేక ఈ మలయాళీ బ్యూటీ పాటలనే నమ్ముకోవాలని నిర్ణయించుకుందట.
 
 ఇప్పుడా అవకాశాలు రాకపోవడంతో తన సొంతంగా ఒక ఆల్బమ్ తయారు చేయడానికి సిద్ధమైందని సమాచారం. ముందుగా ఒక పాట పాడి దాన్ని విడుదల చేసి సంగీత ప్రియుల ఆదరణ చూసి ఆ తరువాత మరిన్ని పాటలు పాడాలనుకుంటున్నారట. పాటల ఆల్బమ్ రూపొందించడం అంత సులభం కాదని అయినా తన స్నేహితులు, సోదరుడి సహకారంతో ఈ ఆల్బమ్‌ను పూర్తి చేయడానికి సిమైనట్లు రమ్యానంభీశన్ పేర్కొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement