కేసీఆర్‌ టూర్‌లో పోలీసుల అత్యుత్సాహం | police overaction in cm kcr tour in khammam district | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ టూర్‌లో పోలీసుల అత్యుత్సాహం

Jan 31 2017 1:08 PM | Updated on Aug 21 2018 7:53 PM

సీఎం పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది.

సూర్యాపేట: సీఎం పర్యటనలో పోలీసుల అత్యుత్సాహం ఓ వృద్ధురాలి ప్రాణం తీసింది. సీఎం కేసీఆర్‌ రోడ్డు మార్గంలో ఖమ్మం పర్యటనకు వెళ్తూ మార్గం మధ్యలో సూర్యాపేటలోని మంత్రి జగదీష్‌ ఇంటికి వచ్చారు. అదే సమయంలో ఆ ఇంటి పక్కనే ఉన్న ఆస్పత్రికి స్థానిక శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన సోమా లక్ష్మమ్మ(65) అనే వృద్ధురాలిని మధ్యాహ్నం 12 గంటల సమయంలో చికిత్స కోసం తీసుకొచ్చారు. అయితే సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు వారిని ఆస్పత్రిలోకి  అనుమతించలేదు.
 
దీంతో సకాలంలో వైద్యం అందక ఆమె మృతి చెందింది. సీఎం వచ్చారంటూ ఆస్పత్రిలోకి వెళ్లడానికి తమను పోలీసులు అనుమతించకపోవడంతోనే తన భార్య మృతి చెందిందని లక్ష్మమ్మ భర్త ఆరోపిస్తున్నారు. ఆమె బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. కాగా ఆమె గుండెపోటుతో మృతి చెందిందని వైద్యులు చెబుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement