‘హోదా’ ఉద్యమానికిదే సమయం | Sakshi
Sakshi News home page

‘హోదా’ ఉద్యమానికిదే సమయం

Published Mon, Feb 6 2017 1:45 AM

‘హోదా’ ఉద్యమానికిదే సమయం - Sakshi

రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు  

సాక్షి, అమరావతి: ఆంధ్రులకు ఆత్మగౌరవం కావాలో, అబద్ధాలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశం ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలపై పోరాటమే శరణ్యమని తీర్మానించింది. సీఎం, కేంద్రమంత్రుల స్థాయిలోని వ్యక్తులు అబద్ధాలు చెబుతున్నా రని, దీన్ని ప్రజలు క్షమించరని హెచ్చరించింది. ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే ప్రభుత్వ తీరు ను ఎదిరించాలని నిర్ణయించింది. జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో జస్టిస్‌ లక్ష్మణరెడ్డి అధ్యక్షతన విభజన చట్టం, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అనే అంశంపై రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.

లక్ష్మణరెడ్డి ప్రారంభోప న్యాసం చేస్తూ హోదా తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత అంటూ మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి విమర్శిం చారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ  కాంగ్రెస్, వైఎస్సార్‌ సీపీ కలసి మోదీ ప్రభుత్వంపై ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే అవిశ్వాసం పెట్టాలన్నారు. హోదా కోసం తమ పార్టీ పోరాడుతూనే ఉందనీ ఎంపీల రాజీనామాను ప్రయోగించేందుకు తమ పార్టీ సిద్ధమైందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మఅన్నారు.

రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ లు రాజీనామా చేస్తే అది పెద్ద చర్యే అవుతుంద న్నారు. ప్రముఖ జర్నలిస్టుకొమ్మినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ విశాఖ విమానాశ్రయంలో ఏపీ విపక్ష నేత జగన్‌ను అడ్డు కోవడమంటే ఉద్య మాన్ని చూసి బాబు భయపడడమేనన్నా రు. లోక్‌సత్తా నేత కె.శ్రీనివాస్, రాయలసీమ అభివృ ద్ధి మండలి నేత ఇస్మాయిల్, చార్టెడ్‌ అకౌంటెంట్‌ వెంకటరెడ్డి, సీనియర్‌ జర్నలిస్టు చెన్ను శివప్ర సాద్, టీవీరావు, పోతురాజు శివ ప్రసంగించారు.

Advertisement
Advertisement