వరి కొనుగోళ‍్ళపై మంత్రుల సమీక్ష | ministers review on Cereal purchases | Sakshi
Sakshi News home page

వరి కొనుగోళ‍్ళపై మంత్రుల సమీక్ష

Apr 15 2017 12:37 PM | Updated on Sep 5 2017 8:51 AM

రాష్ట్రంలో రబీ వరి ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల అధికారులతో మంత్రులు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో రబీ వరి ధాన్యం కొనుగోళ్లపై అన్ని జిల్లాల అధికారులతో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీష్‌రావు, ఈటెల రాజేందర్ సచివాలయంలో శనివారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ.. ఈ ఏడాది వేసంగిలో రికార్డు స్థాయిలో వరి పంట సాగయిందన్నారు.
 
సాధారణ విస్తీర్ణం 5.30 లక్షల హెక్టార్లకు గాను ఈ ఏడాది వేసంగిలో 8.68 లక్షల హెక్టార్లలో వరి సాగయిందని తెలిపారు. నీటి యాజమాన్య పద్ధతులు, నిత్యం మానీటరింగ్‌తో ఎకరాకు వరి దిగుబడి భారీగా పెరిగిందన్నారు. రవాణాకు వాహనాలను సమకూర్చుకొని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటవెంటనే గోడౌన్లకు తరలించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement