ర్యాగింగ్‌కు వైద్య విద్యార్థి బలి | medical student committed suicide | Sakshi
Sakshi News home page

ర్యాగింగ్‌కు వైద్య విద్యార్థి బలి

Nov 23 2013 2:04 AM | Updated on Oct 9 2018 7:52 PM

ర్యాగింగ్ భూతానికి వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయా డు. ఈ విషాదకర సంఘటన కాంచీపురంలో శుక్రవారం చోటుచేసుకుంది.

పళ్లిపట్టు, న్యూస్‌లైన్:  ర్యాగింగ్ భూతానికి వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయా డు. ఈ విషాదకర సంఘటన కాంచీపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణగిరికి చెందిన ముహుల్ రాజ్‌కుమార్(18) కాంచీపుర ంలోని మీనాక్షి ప్రయివేటు వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్‌లోనే ఉంటున్నాడు. ముహుల్‌రాజ్ కుమార్‌ను సీనియర్లు తీవ్రస్థాయిలో ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. ఈ దృష్ట్యా బయట గది తీసుకుని చదువుకుంటానని తల్లిదండ్రులకు అతను చెప్పినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన గదిలో  ఉన్న చీకటీగల మందు తాగి స్పృహ కోల్పోయా డు. రాజ్‌కుమార్‌కు తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. రాత్రి 11 గంట ల సమయంలో అతను ప్రాణాలు విడిచాడు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రు ల రోదన చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియర్లపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. కాంచీపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement