రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో మైసిగండి జాతర 14 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్నాయి.
14 నుంచి మైసిగండి జాతర
Nov 11 2016 3:55 PM | Updated on Mar 28 2018 11:26 AM
కడ్తాల్ : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో మైసిగండి జాతర 14 నుంచి 21వ తేదీ వరకు జరుగనున్నాయి. ఏటా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఎనిమిది రోజుల పాటు జరిగే మైసమ్మ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఆలయ సమీపంలో అక్కన మాదన్న కాలంలో నిర్మించిన శివరామాలయాలు, కోనేరులున్నాయి. ఆలయాల చుట్టూ కొండలు, పచ్చని చెట్లు ఉండటంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలం, కల్వకుర్తి, అచ్చంపేట వెళ్లే బస్సులు ఇక్కడ ఆగుతాయి.
Advertisement
Advertisement