ఆదివారాల్లో పెళ్లిళ్లకు అనుమతిస్తాం.. !

Karnataka Govt Says Marriages Already Fixed On Sundays Will be Exempted From Lockdown - Sakshi

బెంగళూరు : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం లాక్‌డౌన్‌ కాలంలో ప్రతి ఆదివారం పూర్తి స్థాయి కర్ఫ్యూను అమలు చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారాల్లో పెళ్లిళ్లు నిర్ణయించుకున్న వారు వాటిని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం అటువంటి వారికి గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ నెలలో మిగిలిన రెండు ఆదివారాలు మే 24, మే 31 తేదీల్లో పెళ్లిళ్లు నిర్ణయించుకున్నవారు.. షెడ్యుల్‌ ప్రకారం వాటిని జరుపుకోవచ్చని తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు పాటించాలని సూచించింది.

ఆదివారం పూర్తి స్థాయి కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ పెళ్లిలను ప్రత్యేకంగా పరిగణించి మినహాయింపు ఇవ్వనున్నట్టు  రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సభ్యుడు టీకే అనిల్‌ కుమార్‌ తెలిపారు. ‘రాష్ట్ర వాప్యంగా మే 24, మే 31 తేదీల్లో ముందుగా నిశ్చియించిన పెళ్లిళ్లు జరుపుకోవచ్చు. అయితే మార్గదర్శకాలు పాటించాలి. కేవలం 50 మంది అతిథులు మాత్రమే హాజరు కావాలి. భౌతిక దూరం నిబంధనను పాటించడం, మాస్క్‌లు ధరించడంతోపాటుగా శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలి’ అని ఆదేశాలు జారీచేశారు.

ఇందుకోసం డీసీపీల అనుమతి తీసుకోవాలన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్లకు చెందినవారిని పెళ్లికి ఆహ్వానించకూడదని ఆదేశించారు. 65 ఏళ్లు పైబడినవారిని, 10 ఏళ్ల కంటే చిన్నవాళ్లను వివాహా వేడుకలకు దూరంగా ఉంచాలని పేర్కొన్నారు. పెళ్లిలో పాల్గొనేవారు మద్యం సేవించడంపై కూడా నిషేధం విధిస్తున్నట్టు చెప్పారు. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top