ఈ నెల 26 న ముద్రగడ దీక్ష | Kapu leader announces another protest | Sakshi
Sakshi News home page

ఈ నెల 26 న ముద్రగడ దీక్ష

Feb 13 2017 10:55 AM | Updated on Sep 5 2017 3:37 AM

ఈ నెల 26 వ తేదీన సత్యాగ్రహ దీక్ష చేయాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు.

హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులకు చేసిన ద్రోహానికి నిరసనగా ఈ నెల 26 వ తేదీన ఒక్కరోజు సత్యాగ్రహ దీక్ష చేయాలని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పారని ఆయన మండిపడ్డారు. దానికి నిరసగానే కాపులందరు ఒక్కరోజు దీక్ష చేపట్టాలని ఆయన కోరారు.
 
ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తమకు వీలుగా ఉన్న ప్రదేశాల్లో సత్యాగ్రహ దీక్ష చేయాలని ఆయన నిర్ణయించారు. ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొని తమ జాతికి బీసీ రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని అమలు చేయనందుకు నిరసన తెలపాలని ఆయన కోరారు. కర్నూలు జిల్లాలో జరిగే సత్యాగ్రహ దీక్షలో ముద్రగడ పాల్గొననున్నట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement