అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య | farmer suicide in jayashankar district | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య

Feb 18 2017 11:20 AM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శనివారం జరిగింది.

కాటారం: అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో శనివారం జరిగింది. మండల కేంద్రంలోని గారెపల్లికి చెందిన పసుల రాజయ్య(55) అనే రైతు తనకున్న మూడెకరాలతోపాటు మరో పదెకరాల పొలం కౌలుకు తీసుకుని పత్తి సాగు చేశాడు. ఇందుకు రెండేళ్లలో 6 లక్షల రూపాయల అప్పు అయింది. అప్పు తీర్చే మార్గం కానరాక శనివారం తెల్లవారుజామున ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాటారం ఎస్సై కిరణ్‌ సంఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement