సర్దుబాటు గుబులు! | district bifurcation in telangana | Sakshi
Sakshi News home page

సర్దుబాటు గుబులు!

Oct 7 2016 3:06 PM | Updated on Mar 28 2018 11:26 AM

మరో నాలుగు రోజుల్లో నూతన జిల్లాలు మనుగడలోకి రానున్నారుు.

 కార్యాలయాల్లో కనిపించని దసరా సందడి
 వర్క్ టు సర్వ్ ఆర్డర్ల జారీపై మీమాంస
 కొత్త జిల్లాలతో పండగకు ఉద్యోగులు దూరం
 
 మీరే జిల్లాకు వెళ్తున్నారు? మీకెక్కడ పోస్టింగ్ ఇస్తున్నారు? వర్క్ టు సర్వ్ ఆర్డర్లను ఏ రోజున జారీ చేస్తారు? ఏ ఉద్యోగిని కదిలించినా ఇదే చర్చ. ఉన్నతాధికారి మొదలు కిందిస్థాయి సిబ్బంది వరకు ఇదే ఆలోచన. కొత్త జిల్లాల ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతుండడంతో ఉద్యోగవర్గాల్లో కలవరం మొదలైంది.
 
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మరో నాలుగు రోజుల్లో నూతన జిల్లాలు మనుగడలోకి రానున్నారుు. దీంతో ఆయా జిల్లాలకు ఉద్యోగులు తరలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవశేష రంగారెడ్డి జిల్లా మూడు ముక్కలుగా విడిపోనుంది. రంగారెడ్డి సహా వికారాబాద్, మేడ్చల్ పేరిట మరో రెండు కొత్త జిల్లాలకు అంకురార్పణ జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులనే మూడు జిల్లాలకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. ఇందులో భాగం గా ఇప్పటికే విభాగాధిపతులు, అధికారులు, సిబ్బంది మొదలు ప్రతి ఉద్యోగి విభజనకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసింది. ఈ మేరకు ఆయా శాఖాధిపతులు ఉద్యోగుల కేటారుుంపుల ప్రక్రియను కొలిక్కి తెచ్చారు. అరుుతే, ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇచ్చారనే అంశాన్ని గోప్యంగా ఉంచారు. ఈ గోప్యతే ఉద్యోగవర్గాలను గందరగోళంలో పడేసింది. పోస్టింగ్‌లపై స్పష్టత లేకపోవడం.. వర్క్‌టు సర్వ్ ఆర్డర్లతో విధిగా నిర్దేశించిన చోటకు తరలివెళ్లాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. 
 
బదిలీల ఫీవర్!
జిల్లాల పునర్విభజనతో ఉద్యోగవర్గాల్లో దసరా సందడి కనిపించడంలేదు. బదిలీల గుబులుతో విజయదశమిపై అంతగా ఆసక్తిని కనబరచడంలేదు. పునర్విభజనతో సంబంధం ఉన్న ఉద్యోగులకు పండగ సెలవు రద్దు చేయడమేకాకుండా.. 10వ తేదీన ప్రకటించిన ఐచ్చిక సెలవు రోజు కూడా విధిగా విధులకు హాజరుకావాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనికితోడు ఇప్పటివరకు బదిలీలపై స్పష్టతనివ్వకపోవడం.. ప్రస్తుత జిల్లాలోనే కొనసాగుతామా? కొత్తగా ఏర్పడుతున్న జిల్లాలకు బదిలీ అవుతున్నామా అనే విషయాలను తేల్చుకోలేక సతమతమవుతున్నారు. 
 
కలెక్టరేట్, జిల్లాస్థారుులోని అన్ని కార్యాలయాల్లో 2,800 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని మూడు జిల్లాలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత రంగారెడ్డి జిల్లాను మినహారుుస్తే.. దాదాపు 1,800 మందికి స్థానచలనం తప్పదన్నమాట. ఇంతవరకు స్పష్టత ఉన్నా.. వర్క్ టూ సర్వ్ ఆర్డర్లను జారీ చేసేవరకు ఉత్కంఠకు తెరపడదు. మరోవైపు కిందిస్థారుు ఉద్యోగులే కాదు.. ఆఖరికి అఖిలభారత సర్వీసుల అధికారులు మొదలు ఆయా శాఖల విభాగాధిపతులకు కూడా బదిలీల ఫీవర్ పట్టుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement