దుర్గగుడిలో అపచారం | Disservice in vijayawada durga temple in dasara celebrations | Sakshi
Sakshi News home page

దుర్గగుడిలో అపచారం

Oct 4 2016 2:26 PM | Updated on Jul 29 2019 6:03 PM

దుర్గగుడిలో అపచారం - Sakshi

దుర్గగుడిలో అపచారం

దుర్గగుడిలో అత్యంత పవిత్రంగా జరుగుతున్న దసరా ఉత్సవాలలో అపచారం చోటుచేసుకుంది.

ఇంద్రకీలాద్రి : విజయవాడ దుర్గగుడిలో అత్యంత పవిత్రంగా జరుగుతున్న దసరా ఉత్సవాలలో మంగళవారం అపచారం చోటుచేసుకుంది. అమ్మవారికి నివేదన సమర్పించే సమయంలో వీఐపీ భక్తులు గర్భాలయంలో ఉన్నారు. దీంతో భక్తులు బయటకు వచ్చే వరకు అమ్మవారి నివేదనను అధికారులు ఆపించేశారు.

దుర్గమ్మ నివేదన మధ్యలో ఆపేయడం మంచిది కాదని ఆలయ పండితులు వాపోతున్నారు. అమ్మ వారికి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటలకు నివేదన సమర్పిస్తారు. ఆ సమయంలో గర్భగుడిలోనికి ఎవ్వరినీ అనుమతించరు. గర్భాలయాన్ని శుద్ధి చేసిన తర్వాత అమ్మ వారికి నివేదనిస్తారు. మంగళవారం గర్భాలయాన్ని శుద్ధి చేయకుండా నివేదన సమర్పించడంతో పాటు మధ్యలో నివేదనను ఆపడంపై ఆలయ పండితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement