ప్రపంచసుందరివి కావాలి | CM Naveen Patnaik Wishes To Arpita Behera | Sakshi
Sakshi News home page

ప్రపంచసుందరివి కావాలి

Mar 22 2018 1:16 PM | Updated on Mar 22 2018 1:16 PM

CM Naveen Patnaik Wishes To Arpita Behera - Sakshi

అభినందిస్తున్న ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌

భువనేశ్వర్‌: అర్పిత బెహరా ప్రపంచ సుందరి కావాలని  ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అభినందించారు. సంబల్‌పూర్‌ సెయింట్‌ జోసెఫ్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న అర్పిత బెహరా లిటిల్‌ మిస్‌ గెలాక్సీ –2018 పురస్కారం సాధించింది. ఈ పోటీలు బల్గేరియాలో ఇటీవల ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆమెను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. 12 నుంచి 14 ఏళ్లలోపు వర్గంలో ఆమె ప్రదర్శించిన అద్భుత ప్రదర్శనతో ప్రతిష్టాత్మక టైటిల్‌ సాధించడంపట్ల నవీన్‌ పట్నాయక్‌ హర్షం వ్యక్తం చేశారు.

2012లో మిస్‌ సంబల్‌పూర్‌గా
మిస్‌ సంబల్‌పూర్‌ టైటిల్‌ను అర్పిత బెహరా 2012లో గెలుచుకుంది. ఆ ప్రేరణతో ఇంత వరకు ఎదిగింది. భవిష్యత్తులో ఆమె మిస్‌ ఇండియా, మిస్‌ యూనివర్స్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు అర్పిత బెహరా తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement