తమ్ముడిని కడతేర్చిన అన్న | Brother murder in Tiruvalluru | Sakshi
Sakshi News home page

తమ్ముడిని కడతేర్చిన అన్న

Aug 24 2016 1:47 AM | Updated on Sep 4 2017 10:33 AM

తమ్ముడిని కడతేర్చిన అన్న

తమ్ముడిని కడతేర్చిన అన్న

అన్నాతమ్ముళ్ల మద్య ఏర్పడిన గొడవలో మద్యం మత్తులో ఉన్న అన్న కత్తితో పొడిచి తమ్ముడిని హత్య చేశాడు.

తిరువళ్లూరు : అన్నాతమ్ముళ్ల మద్య ఏర్పడిన గొడవలో మద్యం మత్తులో ఉన్న అన్న కత్తితో పొడిచి  తమ్ముడిని హత్య చేశాడు. ఈ సంఘటన తిరువళ్లూరులోని మాపోసి నగర్‌లో చోటుచేసుకుంది. తిరువళ్లూరులోని మాపోసి నగర్‌కు చెందిన మదన్  కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడుగా ఉన్నాడు. ఇతనికి జయబుద్ధన్, సిద్ధార్థన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు జయబుద్ధన్ కెమెరా మెకానిక్‌గా పనిచేస్తుండగా చిన్న కొడుకు సిద్ధార్థన్ తిరుపతిలోని లా కళాశాలో బీఎల్ చదువుతున్నాడు. మద్యానికి బానిసైన జయబుద్ధన్ నిత్యం ఘర్షణ పడేవాడని తెలిసింది.
 
  ఇందులో భాగంగా సోమవారం రాత్రి అన్నాదమ్ముళ్లు ఇద్దరు ఘర్షణ పడ్డారు. దీంతో సిద్ధార్థన్ జయబుద్ధన్‌పై దాడి చేయడంతో ఆగ్రహించిన జయబుద్ధన్ తమ్ముడు సిద్ధార్థన్‌పై కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటనపై మదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మద్యం మత్తులో తమ్ముడిని హత్య చేసిన జయబుద్ధన్‌ను పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద తీవ్ర విచారణ జరుపుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement