నందిగామలో ఉద్రిక్తం | bandh-continuous-in-andhra-pradesh-demanding-special-status-by-ysrcp | Sakshi
Sakshi News home page

నందిగామలో ఉద్రిక్తం

Sep 10 2016 2:56 PM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన ఏపీ బంద్ కృష్ణాజిల్లాలో సంపూర్ణంగా జరుగుతోంది.

నందిగామ:  ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శనివారం తలపెట్టిన ఏపీ బంద్ కృష్ణాజిల్లాలో సంపూర్ణంగా జరుగుతోంది. వైసీపీ కార్యకర్తలు, నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పేరుతో ఉన్న ఫ్లెక్సీలను దున్నపోతులకు కట్టి పట్టణంలో ర్యాలీ చేపట్టారు. ర్యాలీని పోలీసులు అడ్డుకుని నేతలను అరెస్టు చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అరుణ్‌కుమార్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు అరుణ్‌కుమార్‌ను తరలించేందుకు యత్నించారు. కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకోవటంతోపాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడింది.

Advertisement
 
Advertisement
Advertisement