కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Jan 23 2017 11:28 AM | Updated on Sep 5 2017 1:55 AM
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం స్వామివారి తీర్థప్రసాదాదలు అందజేశారు. అనంతరం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో టాలీవుడ్ నటుడు నాని దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Advertisement
Advertisement