ఆసిన్ కోలీవుడ్‌కు రిటర్న్ | Actress Asin plan to return Kollywood Cinema | Sakshi
Sakshi News home page

ఆసిన్ కోలీవుడ్‌కు రిటర్న్

Mar 16 2015 12:58 AM | Updated on Apr 3 2019 9:05 PM

ఆసిన్ కోలీవుడ్‌కు రిటర్న్ - Sakshi

ఆసిన్ కోలీవుడ్‌కు రిటర్న్

నటి ఆసిన్ కోలీవుడ్‌కు రిటర్న్ అవుతున్నారన్నది తాజా వార్త. ఈ కేరళ బ్యూటీ తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథా నాయికిగా

నటి ఆసిన్ కోలీవుడ్‌కు రిటర్న్ అవుతున్నారన్నది తాజా వార్త. ఈ కేరళ బ్యూటీ తమిళం, తెలుగు భాషల్లో ప్రముఖ కథా నాయికిగా ఒక రౌండ్ కొట్టి గజని హిందీ చిత్రం తో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అక్కడ తొలి చిత్రం విజయం, అదీ బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌తో నటించడంతో ఆసిన్ బాలీవుడ్ ఫ్యూచర్ బ్రైట్‌గా ఉంటుందని ఆశించారు.
 
 అనుకున్నవి జరగడానికి సినిమా కాదుగా గజిని చిత్రం తరువాత రెండు మూడు ఆమె ఆశల్ని చిగురింప చేసినా ఆ తరువాత అపజయాలు వెంటాడడంతో అవకాశాలు వెనుకడుగు వేశాయి. ప్రస్తుతం అభిషేక్‌బచ్చన్ సరసన నటిస్తున్న ఆల్ ఈజ్ వెల్ చిత్రం మినహా ఆసిన్ చేతిలో మరో చిత్రం లేదు. ఇలాంటి పరిస్థితిలో నటుడు మాధవన్ హిందీ, తమిళంలో నటించడానికి సిద్ధం అవుతున్న తాజా చిత్రంలో నటించే అవకాశం రావడంతో ఆసిన్ వెంటనే ఒకే చెప్పారట. ఈ చిత్రానికామె పారితోషికం గురించి కూడా చర్చించలేదట. మీరే ఒక ఎమౌంట్‌ను ఫిక్స్ చేయండి అని చెప్పారని సమాచారం. దీంతో ఆసిన్ చాలాకాలం తరువాత తమిళ తెరపైకి రావడం ఖాయం అని తెలుస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement