పెళ్లి బృందం బస్సు వినుకొండ వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది.
వినుకొండ(గుంటూరు జిల్లా): కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి గుంటూరు జిల్లా వినుకొండకు వెళుతున్న పెళ్లి బృందం బస్సు వినుకొండ మండలం చీకటీగలపాళెం గ్రామం వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది.
ఆదివారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో బస్సులోని 15 మంది గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను వినుకొంద ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.