యువరాజ్ సింగ్, హజల్ కీచ్ ఆగ్రహం | Yuvraj Singh Loses Cool After Hazel Keech Alleges Racial Discrimination by Official | Sakshi
Sakshi News home page

యువరాజ్ సింగ్, హజల్ కీచ్ ఆగ్రహం

Sep 1 2016 11:11 AM | Updated on Sep 4 2017 11:52 AM

యువరాజ్ సింగ్, హజల్ కీచ్ ఆగ్రహం

యువరాజ్ సింగ్, హజల్ కీచ్ ఆగ్రహం

టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, అతడికి కాబోయే భార్య హజల్ కీచ్ కు కోపం వచ్చింది.

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్, అతడికి కాబోయే భార్య హజల్ కీచ్ కు కోపం వచ్చింది. జాతి వివక్ష చూపారని ఆరోపిస్తూ వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీ ఉద్యోగిపై విరుచుకుపడ్డారు. పియూష్ శర్మ అనే ఉద్యోగి తన పట్ల జాతివివక్ష చూపించాడని హజల్ కీచ్ ట్విట్టర్ లో వెల్లడించింది. తన పేరు హిందూ మతానికి సంబంధించింది కాదన్న సాకుతో తనకు డబ్బు ఇచ్చేందుకు అతడు నిరాకరించాడని తెలిపింది.

‘నేను కలిసిన వారిలో జైపూర్ లోని వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థలో పనిచేస్తున్న పియూష్ శర్మ అత్యంత జాతివివక్ష కలిగిన వ్యక్తి. నా పేరు హిందూ మతానికి చెందినది కాదన్న కారణంతో నాకు డబ్బు ఇచ్చేందుకు నిరాకరించాడు. ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన నాకు బాధ కలిగించింది. హిందువైన నా తల్లి, నా ముస్లిం ఫ్రెండ్ ఎదురుగా నన్ను అమానించాడు. నా పేరు హజల్ కీచ్. నేను హిందువుగా పుట్టి పెరిగాను. కానీ సమస్య అదికాదు. పేరు చూసి వెస్ట్రన్ యూనియన్ మనీ సంస్థ వివక్ష చూపిస్తుందా’ అని ప్రశ్నించారు.

యువరాజ్ సింగ్ కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు. ’పియూష్ శర్మ ప్రవర్తన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. మనుషులుగా మనమంతా జాతివివక్షను సహించకూడదు. శర్మపై వెస్ట్రన్ యూనియన్ మనీ కఠిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాన’ని యువరాజ్ ట్వీట్ చేశాడు. గతేడాది నవంబర్ లో యువీ-కీచ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement