అశ్విన్‌ను ఆడించాల్సింది | With little flexibility, Ashwin can be a hit abroad: Graeme Swann | Sakshi
Sakshi News home page

అశ్విన్‌ను ఆడించాల్సింది

Jul 20 2014 1:21 AM | Updated on Sep 2 2017 10:33 AM

అశ్విన్‌ను ఆడించాల్సింది

అశ్విన్‌ను ఆడించాల్సింది

విదేశీ గడ్డపై రాణించే శక్తి సామర్థ్యాలు భారత స్పిన్నర్ అశ్విన్‌కు ఉన్నాయని ఇంగ్లండ్ జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు.

గ్రేమ్ స్వాన్ వ్యాఖ్య
 లండన్: విదేశీ గడ్డపై రాణించే శక్తి సామర్థ్యాలు భారత  స్పిన్నర్ అశ్విన్‌కు ఉన్నాయని ఇంగ్లండ్ జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు. పరిస్థితులకు తగ్గట్టు దూకుడుగా బౌలింగ్ వేసే అశ్విన్ జట్టుకు లాభపడగలడని అన్నాడు. ‘నా ఉద్దేశం ప్రకారం అతడు లార్డ్స్ టెస్టులో అతడిని ఆడించాల్సింది.
 
 విదేశాల్లో తగినంతగా అశ్విన్ బౌలింగ్ చేయలేదు. అందుకే తనపై తొందరగా ఓ అంచనాకు రావద్దు. భారత్‌లో అశ్విన్ రికార్డు అద్భుతంగా ఉంది. అక్కడ బాగా బౌలింగ్ చేయగల వాడు ఇంకెక్కడైనా రాణించగలడు. చివరి రోజు ఆటలో తను ప్రత్యర్థి ఆటగాళ్లను ఇరుకున పెట్టగలడు’ అని స్వాన్ చెప్పాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement