ఆరో వన్డే మాకంటే ధోని సేనకే కీలకం: డోహర్తి | We don't want to wait for final game to clinch series: Doherty | Sakshi
Sakshi News home page

ఆరో వన్డే మాకంటే ధోని సేనకే కీలకం: డోహర్తి

Oct 28 2013 8:39 PM | Updated on Sep 2 2017 12:04 AM

ఆరో వన్డే విజయంతోనే భారత్‌పై సిరీస్ విజయం సాధిస్తామని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ జేవియర్ డోహర్తి ధీమా వ్యక్తం చేశాడు.

నాగ్‌పూర్: ఆరో వన్డే విజయంతోనే భారత్‌పై సిరీస్ విజయం సాధిస్తామని ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ స్పిన్నర్ జేవియర్ డోహర్తి ధీమా వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ కోసం చివరి వన్డే దాకా ఎదురుచూడబోమన్నాడు. వర్షంతో రెండు మ్యాచ్‌లు రద్దవడంతో 7 వన్డేల టోర్నీ కాస్త ఇప్పుడు ఐదు వన్డేల సిరీస్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇందులో 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్ ఇక్కడ బుధవారం జరిగే వన్డేలో గెలవాలనే పట్టుదలతో ఉంది. సోమవారం ప్రాక్టీస్ సెషన్ ముగిశాక డోహర్తి మాట్లాడుతూ ‘ఈ మ్యాచ్ గెలిచేందుకే ఇక్కడికొచ్చాం. బెంగళూరు (చివరి మ్యాచ్ వేదిక) వన్డే దాకా భారత్‌కు అవకాశమివ్వం. ఆరో వన్డే మాకంటే ధోని సేనకే కీలకం.  చావోరేవో వారికే కాబట్టి... ఒత్తిడంతా భారత్‌పైనే ఉంది’ అని అన్నాడు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement