అకాడమీ కోసం స్థలాన్ని పరిశీలించిన లక్ష్మణ్‌ | vvs laxman visits kutbullapoor for academy | Sakshi
Sakshi News home page

అకాడమీ కోసం స్థలాన్ని పరిశీలించిన లక్ష్మణ్‌

Jun 30 2017 10:59 AM | Updated on Sep 5 2017 2:52 PM

అకాడమీ కోసం స్థలాన్ని పరిశీలించిన లక్ష్మణ్‌

అకాడమీ కోసం స్థలాన్ని పరిశీలించిన లక్ష్మణ్‌

క్రికెట్‌ అకాడమీ నిర్మాణం కోసం భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ గురువారం కుత్బుల్లాపూర్‌లో పర్యటించారు.

హైదరాబాద్: క్రికెట్‌ అకాడమీ నిర్మాణం కోసం భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ గురువారం కుత్బుల్లాపూర్‌లో పర్యటించారు. బహదూర్‌పల్లి గ్రామ సర్వే నెంబరు 239, 240లో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి అకాడమీ కోసం లక్ష్మణ్‌ దరఖాస్తు చేసుకున్నారు.

మేడ్చల్‌ జిల్లా పరిధిలోని బహదూర్‌పల్లిలో అప్పట్లో రాజీవ్‌ స్వగృహ కోసం 40 ఎకరాలు కేటాయించగా ఇప్పుడు ఆ భూమి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అకాడమీకి ఆ ప్రదేశం అనువుగా ఉంటుందని భావించిన లక్ష్మణ్‌ స్థానిక రెవెన్యూ అధికారులు సదానంద్, రేణుకాదేవి, శ్రీశైలంలతో కలిసి పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement