స్ట్రయికర్ మెండోజా వాలెన్సియా అద్భుత ఆటతీరుతో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు వరుసగా రెండో...
ముంబై: స్ట్రయికర్ మెండోజా వాలెన్సియా అద్భుత ఆటతీరుతో చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సత్తా చూపింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో శుక్రవారం ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో 2-0తో చెన్నైయిన్ నెగ్గింది. ఈ రెండు గోల్స్‌నూ వాలెన్సియా (60, 66వ నిమిషాల్లో) కేవలం ఆరు నిమిషాల వ్యవధిలోనే సాధించాడు. గత మ్యాచ్‌లోనూ గోవాపై వాలెన్సియా హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
మ్యాచ్ ఆరంభంలో ముంబై కాస్త పైచేయి సాధించి దాడులకు దిగింది. అయినా ప్రథమార్ధంలో ఇరు జట్ల ఆటగాళ్ల గోల్స్ ప్రయత్నాలు వమ్మయ్యాయి. 60వ నిమిషంలో ఎలనో షాట్ గోల్‌కీపర్‌కు తాకి వెనక్కి రాగా వాలెన్సియా అందుకుని గోల్ సాధించాడు. వెంటనే మరో ఆరు నిమిషాల్లో రెండో గోల్‌తో జట్టును గెలిపించాడు.