ఇద్దరు యూఏఈ క్రికెటర్లకు గేల్‌ స్కాలర్‌షిప్‌ | Two young UAE cricketers get Gayle scholarships | Sakshi
Sakshi News home page

ఇద్దరు యూఏఈ క్రికెటర్లకు గేల్‌ స్కాలర్‌షిప్‌

Sep 30 2013 8:00 PM | Updated on Sep 1 2017 11:12 PM

ఇద్దరు యూఏఈ టీనేజ్‌ క్రికెటర్లు క్రిస్‌గేల్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు.

దుబాయ్‌: ఇద్దరు యూఏఈ టీనేజ్‌ క్రికెటర్లు క్రిస్‌గేల్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. 16 ఏళ్ల శోర్‌‌య చోప్రా, కార్తీక్‌ శేఖర్‌లు యూఏఈ జూనియర్‌, దేశవాళీ జట్ల తరఫున చక్కని ప్రతిభ కనబరచడంతో వెస్టిండీస్‌ డాషింగ్‌ ఓపెనర్‌ స్కాలర్‌షిప్‌ను దక్కించుకున్నారు. ఈ స్కాలర్‌షిప్‌ కింద వారిద్దరికి రూ. 82 వేలు (1300 డాలర్లు) విలువ చేసే క్రికెట్‌ సామాగ్రి లభించింది. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో గేల్‌, మైకేల్‌ క్లార్‌‌క (ఆసీస్‌)లు వాడిన బ్యాట్లు కూడా అందజేశారు.

 

విండీస్‌ మాజీ కెప్టెన్‌ జిమ్మీ ఆడమ్‌‌స శిక్షణలో చోప్రా, శేఖర్‌లు రాటుదేలిన విషయం ఆలస్యంగా తెలుసుకున్న గేల్‌ ఇద్దర్ని అభినందించాడు. ‘ప్రాక్టీస్‌లో కష్టపడండి, ఆట కోసం చెమటోడ్చండి’ అని సూచించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement