​మెరుపు క్యాచ్‌.. మతిపోయిందంతే... | Trent Boult Kohli Catch in IPL a LifeTime | Sakshi
Sakshi News home page

Apr 22 2018 11:23 AM | Updated on Apr 22 2018 5:53 PM

Trent Boult Kohli Catch in IPL a LifeTime - Sakshi

ట్రెంట్‌ అద్భుత క్యాచ్‌.. బిత్తరపోయిన కోహ్లి

సాక్షి, బెంగళూరు : ఫుల్‌ ఫామ్‌తో ఉన్న కోహ్లి.. లాంగ్‌ ఆన్‌లో కొట్టిన బంతి... ఎవరూ ఊహించని క్యాచ్‌. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ప్లేయర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (న్యూజిలాండ్‌ ఆటగాడు) పట్టిన సూపర్‌ క్యాచ్‌తో ఏం జరుగుతుందో అర్థంకాక కోహ్లి కాసేపు బిత్తరపోయాడు. క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ క్యాచ్‌ గురించే చర్చిస్తోంది. గత రాత్రి బెంగళూర్‌ రాయల్‌ చాలెంజర్స్‌ వర్సెస్‌ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటు చేసుకుంది. 30 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద హర్షల్‌ పటేల్‌ వేసిన ఫుల్‌ టాస్‌ బంతిని కోహ్లి బౌండరీ మీదకు తరలించాడు. అయితే అప్పటికే లైన్‌ వద్ద కాసుకుని ఉన్న బౌల్ట్‌.. బంతి గాల్లో ఉండగానే అమాంతం ఎగిరిన కుడి చేత్తో ఒడిసి పట్టేశాడు. ఆపై బౌండరీ లైన్‌పై పడకుండా బాడీని బ్యాలెన్స్‌ చేశాడు.

ఊహించని ఆ క్యాచ్‌కు కోహ్లి కంగుతినగా.. ఎంపైర్లు రివ్యూ కోసం థర్డ్‌ అంపైర్‌ను సంప్రదించారు. ఇక రిప్లైలో అది ఔటని తేలింది. ఈ వీడియోను ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ అఫీషియల్‌ ఈ సీజన్‌కు ఇప్పటిదాకా ఇదే ఉత్తమ క్యాచ్‌ అని పేర్కొంటూ ట్వీట్‌ చేసింది. మరోవైపు సోషల్‌ మీడియాలో కూడా ఈ వీడియోను షేర్‌ చేస్తూ పలువురు ట్రెంట్‌ సూపర్‌ మ్యాన్‌ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. డేవిడ్‌ లాయ్‌, మైకేల్‌ వా, షేన్‌ వార్న్‌ లాంటి దిగ్గజాలతోపాటు బెన్‌ స్ట్రోక్స్‌.. ఆకాశ్‌ చోప్రా, అలెక్స్‌ హేల్స్‌ కూడా ట్రెంట్‌ బౌల్ట్‌ పై లైఫ్‌ టైమ్‌ క్యాచ్‌ అంటూ ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement