గేల్ లేకుండానే భారత్‌కు... | To India without Gayle ... | Sakshi
Sakshi News home page

గేల్ లేకుండానే భారత్‌కు...

Sep 25 2014 1:28 AM | Updated on Sep 2 2017 1:54 PM

గేల్ లేకుండానే భారత్‌కు...

గేల్ లేకుండానే భారత్‌కు...

వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా): విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ లేకుండానే వెస్టిండీస్ జట్టు భారత్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది.

వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
 సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా): విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ లేకుండానే వెస్టిండీస్ జట్టు భారత్‌తో వన్డే సిరీస్‌లో తలపడనుంది. ఈ నెల 8నుంచి జరిగే ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం వెస్టిండీస్ బోర్డు బుధవారం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. కండరాల గాయంతో బాధ పడుతున్న గేల్ ఇంకా కోలుకోనందున అతడిని ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. గత రెండు సిరీస్‌లలో జట్టులో స్థానం కోల్పోయిన శామ్యూల్స్, డ్వేన్ స్మిత్‌లకు మళ్లీ చోటు దక్కింది. పేసర్ జెరోమీ టేలర్‌కు కూడా నాలుగేళ్ల తర్వాత మళ్లీ పిలుపొచ్చింది.
 భారత్‌తో వన్డే సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు: డ్వేన్ బ్రేవో (కెప్టెన్), డారెన్ బ్రేవో, హోల్డర్, లియోన్ జాన్సన్, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, రామ్‌దిన్, రవి రాంపాల్, కీమర్ రోచ్, ఆండ్రీ రసెల్, డారెన్ స్యామీ, శామ్యూల్స్, సిమన్స్, డ్వేన్ స్మిత్, టేలర్.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement