నార్త్‌ఈస్ట్‌పై పుణే విజయం | The success of the north-east on Pune | Sakshi
Sakshi News home page

నార్త్‌ఈస్ట్‌పై పుణే విజయం

Nov 4 2014 12:06 AM | Updated on Sep 2 2017 3:49 PM

నార్త్‌ఈస్ట్‌పై పుణే విజయం

నార్త్‌ఈస్ట్‌పై పుణే విజయం

పుణే: నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీ 1-0తో విజయం సాధించింది.

పుణే: నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ పుణే సిటీ 1-0తో విజయం సాధించింది. ఐఎస్‌ఎల్‌లో భాగంగా సోమవారం శ్రీ శివ్ చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జాన్ గూసెన్స్ (88వ నిమిషంలో) గోల్‌తో పుణే గట్టెక్కింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్ల మధ్య గోల్ కోసం హోరాహోరీ పోరు జరిగింది. గోల్‌కీపర్లు సమర్థంగా అడ్డుకోవడంతో ఇరు జట్ల ఆటగాళ్ల ప్రయత్నాలు విఫలయమ్యాయి. అయితే ద్వితీయార్ధం 88వ నిమిషంలో పుణేకు అవకాశం చిక్కింది.

అవుట్ సైడ్ బాక్సు నుంచి డుడు కొట్టిన కిక్.. క్రాస్ బార్‌కు తాకి బయటకు రాగా అక్కడే ఉన్న జాన్ గూసెన్స్ హెడర్ గోల్‌తో బంతిని గోల్ పోస్టులోకి పంపి తమ శిబిరంలో ఆనందం నింపాడు. ఈ విజయంతో పుణే ఏడు పాయింట్లతో నాలుగో స్థానానికి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement